BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఘనముగా టీడీపీ @44 వ ఆవిర్బవా వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
31 Mar, 2026 - 02:12 AM
88 వీక్షణలు

నంద్యాలలో మిన్నంటిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

ఘనంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు, సీనియర్ నాయకులకు సన్మానం

నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందుగా టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పార్టీకి జై కొడుతూ ఉత్సాహంగా సాగారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ర్యాలీ అనంతరం పార్టీ కార్యాలయంలో మంత్రి ఫరూక్ పార్టీ జెండాను ఆవిష్కరించి, ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువుటద్దం తెలుగుదేశం పార్టీ అని అన్నారు . "పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా నందమూరి తారకరామారావు గారు 44 ఏళ్ల క్రితం ఈ పార్టీని స్థాపించారని . నాటి నుండి నేటి వరకు టీడీపీ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిందని తెలిపారు . "నాడు ఎన్టీఆర్ వేసిన పునాదిపై, నేడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని . సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు . నంద్యాల నియోజకవర్గ అభివృద్ధికి, మైనార్టీల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని . కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ప్రజల వద్దకు ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లాలని తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీ జెండాను మోసిన కార్యకర్తలే మా బలం. వారి త్యాగాల వల్లే పార్టీ నేడు ఈ స్థాయిలో ఉందని . సీనియర్ నాయకుల అనుభవం, యువ నాయకత్వ ఉత్సాహం కలిసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ప్రతి కార్యకర్త పనిచేయాలని . ఎన్టీఆర్ ఆశయ సాధనలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుండి క్రమశిక్షణతో, నిబద్ధతతో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న పలువురు టిడిపి సీనియర్ నాయకులను మంత్రి ఫరూక్ ఈ సందర్భంగా శాలువాలతో ఘనంగా సన్మానించి వారితో కలిసి భోజనం చేశారు . పార్టీ అభివృద్ధిలో వారి పాత్ర చిరస్మరణీయమని తెలిపారు 


ఈ కార్యక్రమంలో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దిదేకుల దస్తగిరి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కొప్పుల శివ నాగిరెడ్డి, కంచర్ల సురేష్, నంద్యాల మండల కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి, గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి, జైనాబి, శ్రీదేవి, నాగార్జున, దేవస్థానాల చైర్మన్లు చలం బాబు, డాక్టర్ అనిల్ కుమార్, బెండకాయల ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు