BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 10 September 2025, 09:30 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమం

తెలంగాణ
10 Sep, 2025 - 09:30 AM
289 వీక్షణలు
ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమం NTODAY NEWS: భువనగిరి జిల్లా శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో  చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని బుధవారం భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామపంచాయతీ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ సాయుధరైతంగా పోరాటానికి పునాదులు వేసింది చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు. అగ్రకులాల స్త్రీలు, దొరసానిలు తమను కూడా దొర అని ఉత్పత్తి కులాల చేత పిలిపించుకునే సంస్కృతికి చరమగీతం పాడిన వారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారని అన్నారు. తమను దొరా అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి దగ్గరుండి అఘాయిత్యం చేయించేవారు అని అన్నారు. భూమికోసం ,భుక్తి కోసం, వెట్టిచాకిరి నుండి విముక్తి కోసం జరిగిన మహోత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గ్రామ గ్రామాన ప్రజలను సమీకరించి పోరాట తత్వాన్ని నేర్పింది అన్నారు. ఐలమ్మ కౌలుకు తీసుకున్న 40 ఎకరాల్లో 4 ఎకరాల భూమిలో సాగును కొనసాగించి పండిన పంటను నాటి విసునూరు దేశ్ముఖు రామచంద్రారెడ్డి అక్రమంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం మాత్రం ఆపలేదన్నారు. నా ప్రాణం పోయాక ఈ పంట భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటలుగా మలుచుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ దొరగాడు ఇంతకంటే ఇంకా నన్ను ఏ విధంగా నష్టపెట్టగలడు అని తనలో తాను ప్రశ్నించుకున్నది నీ దొరవాడు ఏం చేస్తాడు అని మొక్కవోని ధైర్యంతో రోకలిబండ చేతబూని గూండాలను తరిమికొట్టింది కాలినడకన వెళ్లి దొరకు సవాల్ విసిరింది ఐలమ్మ భూ పోరాటం విజయంతో ధాన్యాన్ని ప్రజలకు పంచారు అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు ఐలమ్మ భూ పోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు 4000 మంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారని 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగిందన్నారు. Follow us on Website Facebook Instagram YouTube