BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 16 September 2025, 06:41 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

విజయవాడలో రెచ్చిపోతున్న హిజ్రాలు

తెలంగాణ
16 Sep, 2025 - 06:41 PM
374 వీక్షణలు
విజయవాడలో రెచ్చిపోతున్న హిజ్రాలు NTODAY NEWS: విజయవాడ కొంతమంది హిజ్రాల ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది. జుగుస్సకరంగా ప్రవర్తిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శుభ, ఆశుభ కార్యం ఏదైనా సరే దందా మొదలుపెడతారు. గృహప్రవేశాలు పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలకు ఇలా కార్యక్రమం ఏదైనా సరే ఇండ్ల వద్దకు ఇట్టే వాలిపోతుంటారు. వేలకు వేలు డిమాండ్ చేసి ఇంటి యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి ఆగడాలను తట్టుకోలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బదులు పడుతున్నారు. ఈ సందర్భంగా హిజ్రాల దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం నగరంలో పలువురు ఆందోళనకు దిగారు. ఈ నెల 13వ తేదీన హిజ్రాల వేధింపులను తట్టుకోలేక సత్యకుమారి అనే మహిళ కూడా ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం సోమవారం నాడు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో గిరిపురం సెంటర్ దగ్గర మృతదేహంతో మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. విజయవాడలో హిజ్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నడి రోడ్డుపై బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న మాచవరం పోలీసులు, అక్కడికి చేరుకొని మృతురాలి బంధువులతో చర్చలు జరిపారు. వారిపై తగిన చర్యలు తాము తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ సందర్భంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న హిజ్రాలే టార్గెట్ గా కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు. Follow us on Website Facebook Instagram YouTube