BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 22 May 2026, 07:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

IAS అధికారులు అయినా రిజర్వేషన్ ఎందుకు..? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 07:22 PM
166 వీక్షణలు

తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులు వంటి ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు వారి పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకు కల్పించాలంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన తరగతుల్లో ఆర్థికంగా, సామాజికంగా ఇప్పటికే ఉన్నత స్థితికి చేరుకున్న కుటుంబాలకు రిజర్వేషన్ వర్తింపుపై విచారణ సందర్భంగా ఈ అభిప్రాయం వెల్లడించింది.

“సామాజికంగా, ఆర్థికంగా ముందంజలో ఉన్న వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగించడం సరైంది కాదు. నిజంగా వెనుకబడిన వారికి అవకాశాలు చేరాలి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉన్నత స్థితికి చేరుకున్న వర్గాలను రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి తప్పించాలని పేర్కొన్నప్పటికీ, వాటిని కొందరు సవాల్ చేస్తున్నారని కోర్టు తెలిపింది. అలాంటి వారిని రిజర్వేషన్ పరిధి నుంచి మినహాయించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.