BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 19 April 2026, 03:10 pm
Posted by : సిర మహేష్

ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
19 Apr, 2026 - 03:10 PM
162 వీక్షణలు

శిధిలావస్థకు చేరిన చెరువు తూములను మరమ్మత్తు చేయాలిసిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్

చారిత్రత్మాక గ్రామమైన ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా మార్చి శిథిలావస్థకు చేరిన చెరువు తూములను మరమ్మత్తు చేయాలని సిపిఎం యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పోరుయాత్రలో భాగంగా ఇంద్రపాలనగరంలో గ్రామ శాఖ నాయకత్వంతో కలిసి పలు సమస్యలను పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీ.శ ఆరవ శతాబ్దంలో విష్ణుకుండ్యుల రాజధానిగా చేసుకొని పాలించిన చారిత్రాత్మక ప్రదేశం నేడు నిరాధారణకు గురై పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నెలకొన్నదని అన్నారు. నాలుగు దశబ్దాలుగా ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి హయాం నుండి ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇస్తూ అమలుకు నోచుకోకుండా పోతుందని ఇతర ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తే కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదని వాపోయారు. నాటి పురాతన ప్రతిమలన్నీ శిధిలమై గుర్తుతెలియని వ్యక్తుల తవ్వకాలతో ధ్వంసమైపోతున్నాయని పురావస్తు శాఖ చొరవ తీసుకొని వీటిని పరిరక్షించి, పర్యారకులకు కాటేజీలు ఏర్పాటు చేసి గ్రామానికి రెవిన్యూ పెంచాలని ప్రభుత్వం వెంటనే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి సౌకర్యాలు కల్పించాలని అదేవిధంగా శిధిలావస్థకు చేరిన చెరువు తూములను వెంటనే మరమ్మత్తు చేయాలని గత కాలం నుండి ప్రమాదకరంగా ఉండి ఇద్దరు మరణించడం జరిగిందని చెరువుకు ప్రధాన తోము కావడంతో రైతులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరమ్మతులు చేసి వెంటనే సమస్య పరిష్కరించాలని అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య,మండల కమిటీ సభ్యులు మీర్ ఖాజా అలీ, శాఖ కార్యదర్శి గన్నెబోయిన శ్రీనివాస్, కొంగరి నర్సింహా, నాయకులు కొమ్మగోని అశోక్, భువనగిరి అశోక్, నాగు నర్సింహా, రాదారపు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.