BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 13 May 2026, 08:32 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇంటికి తాళం వేసి ఊరు వెళ్తున్నారా..? ముందుగా పోలీసులకు చెప్పండి.. లేదంటే దొంగల టార్గెట్ అయ్యే ప్రమాదం!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 08:32 AM
218 వీక్షణలు

NTODAY NEWS చాట్రాయి:

ఇంటికి తాళం వేసి వెళ్లిపోతే.. దొంగలకు ఆహ్వానం పలికినట్టే” అంటూ చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ ప్రజలను అప్రమత్తం చేశారు. మండలంలో వరుస దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన నేపథ్యంలో, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మంగళవారం ఎర్రవారి గూడెం, కొత్తగూడెం, సోమవరం గ్రామాల్లో మైక్ అనౌన్స్‌మెంట్ నిర్వహించిన ఎస్ఐ రామకృష్ణ.. ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లే వారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. “తాళం వేసి ఉన్న ఇళ్లపైనే దొంగల కన్ను ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న నిర్లక్ష్యం జీవితకాల కష్టార్జితాన్ని పోగొట్టే ప్రమాదం ఉంది” అని హెచ్చరించారు.

ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇవ్వడం, ఇంటి చుట్టూ లైట్లు ఆన్‌లో ఉంచడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో కొత్తగా కనిపించే వ్యక్తులు, పాత సామాన్లు కొనుగోలు చేసే వారు, సేల్స్‌మెన్ ముసుగులో తిరిగే అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని కోరారు.

“ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వండి. మీ ఒక్క ఫోన్ కాల్ పెద్ద నేరాన్ని అడ్డుకోవచ్చు” అని ఎస్ఐ తెలిపారు.

రాత్రి వేళల్లో కిటికీల దగ్గర నిద్రించే వారు బంగారు గొలుసులు, నగలు ధరించవద్దని, నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను బీరువాల్లో భద్రపరుచుకోవాలని సూచించారు.

గ్రామాల్లో రాత్రిపూట పోలీస్ గస్తీని మరింత కట్టుదిట్టం చేశామని, ప్రజల భద్రత కోసం పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా ఉన్నారని ఎస్ఐ రామకృష్ణ వెల్లడించారు. “ప్రజల సహకారంతో చాట్రాయిని నేర రహిత మండలంగా తీర్చిదిద్దుతాం” అని ధీమా వ్యక్తం చేశారు.