BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 08:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జార్జిపేటలో సూర్య ఘర్ సోలార్ ప్యానెల్స్‌పై క్షేత్రస్థాయి తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:51 PM
90 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

పనితీరు, భద్రతా ప్రమాణాలపై అధికారుల పరిశీలన – ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలే లక్ష్యం

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం జార్జిపేట గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సూర్య ఘర్ సోలార్ పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్‌ను చింతలపూడి ఎలక్ట్రికల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీ) రాంబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా సోలార్ ప్యానెల్స్ పనితీరు, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ విధానాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పథకం ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైన నిర్వహణ పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

సూర్య ఘర్ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందడంతో పాటు విద్యుత్ బిల్లుల భారం తగ్గించి స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పథకం ప్రయోజనాలు ప్రతి అర్హ కుటుంబానికి పూర్తిస్థాయిలో చేరేలా విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని వెల్లడించారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో విద్యుత్ శాఖ లైన్మెన్ రెడ్డి నాయక్ పాల్గొన్నారు.