BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 March 2026, 05:50 am
Posted by : ఉపారపు లక్ష్మణ్

జూలై 31 లోగా పనులు పూర్తి చేయాలి

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
17 Mar, 2026 - 05:50 AM
113 వీక్షణలు

కరీంనగర్: జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం భారత జాతీయ రహదారి సంస్థ (NHAI) వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు భరద్వాజ్, ఆర్డీఓ మహేశ్వర్ మరియు ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరంగల్ నుండి కరీంనగర్ వరకు ఇప్పటికే 89 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఈ ఏడాది జూలై 31 లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భూసేకరణ వంటి పెండింగ్‌లో ఉన్న సమస్యలను రెవెన్యూ మరియు NHAI అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని సూచించారు.

కొత్తపల్లి-హుస్నాబాద్ రహదారిపై సమీక్ష:

అనంతరం కొత్తపల్లి-చిగురుమామిడి-హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారి నిర్మాణ పురోగతిని కూడా కలెక్టర్ సమీక్షించారు. విద్యుత్ స్తంభాల తొలగింపు, పునర్నిర్మాణం మరియు భూసేకరణ పనులపై ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ పనులపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తానని ఆమె స్పష్టం చేశారు.