BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 25 June 2026, 07:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జి.కొండూరులో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం.. 3,336 మంది చిన్నారులకు చుక్కలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 07:17 PM
100 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలంలో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. మండలంలోని ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

మండల వ్యాప్తంగా 3,336 మంది ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించిన అధికారులు, వారికి పోలియో చుక్కలు వేసేందుకు 23 బూత్‌లను ఏర్పాటు చేశారు. కార్యక్రమం నిర్వహణ కోసం వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, సూపర్వైజర్లతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించారు.

జూన్ 28న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయనుండగా, 29 మరియు 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిన చిన్నారులకు చుక్కలు వేయనున్నారు. ఒక్క చిన్నారి కూడా మిగలకుండా చూడాలనే లక్ష్యంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

పోలియో నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్న వైద్యాధికారి, తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. "రెండు చుక్కలతో జీవితాంతం రక్షణ" అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.