BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 27 July 2026, 09:56 pm
Posted by : కూనురు మధు

జిల్లా స్థాయి మహిళ త్రో బాల్‌లో ఉరుమడ్లకు ద్వితీయ స్థానం ​

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
27 Jul, 2026 - 09:56 PM
39 వీక్షణలు

జిల్లా స్థాయి మహిళ త్రో బాల్‌లో ఉరుమడ్లకు ద్వితీయ స్థానం ​

ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామోత్సవంలో భాగంగా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ కళాశాలలో జిల్లా స్థాయి మహిళా త్రో బాల్ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో చిట్యాల మండలం ఉరుమడ్ల  గ్రామానికి చెందిన మహిళల జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచి, రెండవ బహుమతిని కైవసం చేసుకుంది. ​ఈ సందర్భంగా విజేతగా నిలిచిన క్రీడాకారులు హైదరాబాద్ లో జరగబోయే రాష్ట్ర స్థాయి త్రోవాల్ పోటీలలో  పాల్గొననున్నారు ఈ సందర్భంగా ఉరుమడ్ల సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామానికి చెందిన క్రీడాకారులు తమ ప్రతిభతో ఉరుమడ్ల  పేరును జిల్లా స్థాయిలో నిలబెడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది అని అన్నారు. ఈ సందర్భంగా క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందిస్తాయి అని. క్రీడల్లో రాణించడం ద్వారా భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలను కూడా సొంతం చేసుకోవచ్చు.అని అన్నారు. అంతేకాకుండా క్రీడాకారులకు సొంత ఖర్చులతో జెర్సీలను బహుకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్' జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు, వార్డు మెంబర్లు గంగాపురం రాము, వెలిమినేటి హరిప్రసాద్, మెడబోయిన స్వాతి శ్రీను, బోయ సుష్మిత, మహిళ క్రీడాకారులు మాధగోని నాగమణి, కోరబోయిన పుష్పలత, మర్రి కల్పన, సాగర్ల వైష్ణవి, ఈర్ల నవ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.