BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 29 March 2026, 11:35 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జనార్ధనవరంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 11:35 AM
305 వీక్షణలు

జనార్ధనవరంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడినాయి. గ్రామ పార్టీ అధ్యక్షుడు మాదాసు చిన్న పుల్లయ్య, మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జగాని వెంకటేశ్వరరావు, చాట్రాయి మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ ఆవిర్భావం వెనుక ఉన్న లక్ష్యాలు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధానాలను స్మరించుకున్నారు.

కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు వంగల సుబ్బారావు, టిడిపి ఉపాధ్యక్షుడు పామర్తి నాగరాజు, తెలుగు యువత ఉపాధ్యక్షుడు బొద్దు వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ సెక్రటరీ బలువూరి రత్తయ్య, వంగల రమేష్, ఆడమిల్లి మోషే, పులపాక రఘు, నడిపింటి వెంకటేశ్వరరావు, బొరిగొర్ల తిరుపతిరావు, మాదిరాజు ప్రసాదు, గోపాలస్వామి, రాచకొండ కృష్ణ, చీప్ వెంగళరావు, నందమూరి ఏసుబాబు, కొనకాల చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.