BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 04 June 2026, 04:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జనసేనలో కొత్త రాజకీయ సంస్కృతికి నాంది.. పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 04:17 PM
111 వీక్షణలు

జనసేన పార్టీని కేడర్ ఆధారిత రాజకీయ శక్తిగా మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో “జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల” ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న జనసైనికులు, సాధకులు, నాయకులను గుర్తించి వారికి తగిన బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో ఈ కమిటీలు పనిచేయనున్నాయి. జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన ఈ వ్యవస్థలో నాయకుల సేవలు, ప్రజల్లో వారి ఆదరణ, నాయకత్వ లక్షణాలు, పార్టీ పట్ల నిబద్ధత వంటి అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించి పార్టీ అధ్యక్షుడి పరిశీలనకు సమర్పిస్తారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ముగ్గురు సాధకులు కలిపి 7 మంది ప్రధాన సభ్యులతో పాటు, వారికి సహకరించే 21 మంది సాధకులు ఈ కమిటీల్లో ఉంటారు. కమిటీలలో వీరమహిళలకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించారు.

ఈ కమిటీల కూర్పును కొణిదెల పవన్ కళ్యాణ్ స్వయంగా సమీక్షించి ఆమోదించారు. కమిటీలు అందించే నివేదికలు, పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయాన్ని ఆయనే తీసుకోనున్నారు.

దశాబ్దన్నర క్రితమే రూపుదిద్దుకున్న “జనసైనికుల నుంచే నాయకత్వం” అనే ఆలోచనకు కార్యరూపం ఇస్తూ, క్షేత్రస్థాయిలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు కల్పించే దిశగా జనసేన పార్టీ ఈ వినూత్న ప్రక్రియను ప్రారంభించింది.