BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 04 June 2026, 02:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జూన్ 19న తల్లికి వందనం నిధుల జమకు అవకాశం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 02:37 PM
128 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు అందిస్తున్న ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలపై తాజా సమాచారం వెలువడింది. ఈ విద్యా సంవత్సరంలో కూడా పథకం కింద నగదు జమను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే చేయాలని ప్రభుత్వం ముందుగా భావించింది.

ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం జూన్ 12ననే నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేయాలని మొదట నిర్ణయించారు. అయితే లబ్ధిదారుల అర్హతలపై క్షేత్రస్థాయిలో జరుగుతున్న సమగ్ర పరిశీలన కారణంగా ఆ తేదీ వాయిదా పడినట్లు సమాచారం.

కారణం ఇదే

స్కూళ్ల నుంచి సేకరించిన విద్యార్థుల డేటాను సచివాలయాల స్థాయిలో తిరిగి పరిశీలిస్తున్నారు. అర్హులకే లబ్ధి అందేలా, అనర్హులు జాబితాలో చేరకుండా కఠిన మార్గదర్శకాల ప్రకారం తనిఖీలు కొనసాగుతున్నాయి.

దాదాపు 60 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉండటంతో డేటా ధృవీకరణ ప్రక్రియ ఆలస్యమవుతోంది.

తాజా అంచనా తేదీ

తాజా సమాచారం ప్రకారం జూన్ 19న నిధులు జమ చేసే అవకాశం ఉంది. ఒకటి రెండు రోజులు అటు ఇటుగా కూడా విడుదల జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచిస్తున్నారు. తుది జాబితా ఖరారైన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది.