BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 22 May 2026, 06:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కాక్రోచ్ జనతా పార్టీ ప్రకంపనలు.. ఎన్డీఏలో కలకలం : హరినాథ్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 06:11 PM
214 వీక్షణలు

కాక్రోచ్ జనతా పార్టీ ప్రకంపనలు.. ఎన్డీఏలో కలకలం : హరినాథ్

భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మే 15న నిరుద్యోగ యువతను బొద్దింకలుగా వ్యాఖ్యానించడాన్ని నిరసిస్తూ ఏర్పడిన “కాక్రోచ్ జనతా పార్టీ” ప్రభావం ఎన్డీఏ నేతలను వణికిస్తోందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉద్యోగాలు దొరక్క నిరాశ, అసంతృప్తితో ఉన్న యువత సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా తీసుకొని అధికారులను ప్రశ్నిస్తున్నారని, అలాంటి సందర్భంలో విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ వారిని బొద్దింకలుగా పేర్కొనడం బాధాకరమని హరినాథ్ అన్నారు. నిరసనలు వెల్లువెత్తిన తరువాత జస్టిస్ సూర్యకాంత్ తన వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయని, ఫేక్ డిగ్రీల వారికి మాత్రమే ఆ వ్యాఖ్య చేశానని వివరణ ఇచ్చారని తెలిపారు.

దేశ ప్రధానిమీద ఉన్న డిగ్రీ వివాదాన్ని కూడా న్యాయవ్యవస్థ పరిశీలించాలని హరినాథ్ డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిపాంకర్ భట్టాచార్య కూడా హిట్లర్ కాలం నుంచి ఫాసిస్టు ద్వేష ప్రచారం కొనసాగుతోందని, నిరుద్యోగ యువతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారని చెప్పారు.

ప్రజాస్వామ్యం, భిన్నాభిప్రాయాల పట్ల ఉన్న ఈ అమానుష ధోరణికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్పందన రావడం ప్రజలకు భరోసానిచ్చిందని హరినాథ్ పేర్కొన్నారు.

కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించిన ఐదు అంశాల మేనిఫెస్టో సహేతుకమైనవేనని ఆయన వివరించారు. న్యాయమూర్తులు పదవీ విరమణ అనంతరం ప్రభుత్వ పదవులు చేపట్టకుండా చట్టం చేయాలని, మహిళా రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలని, పార్టీలు మారిన ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించాలని, పెద్ద కార్పొరేట్ సంస్థలు మాధ్యమాల్లోకి ప్రవేశించకుండా నిష్పాక్షిక మాధ్యమాలను ప్రోత్సహించాలని, ఓటర్ల పేర్ల తొలగింపును అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.

ఒక్క రోజులోనే అభిజిత్ చేపట్టిన డిజిటల్ ఉద్యమం లక్షలాది యువతకు చేరిందని, వారి అసంతృప్తిని బహిర్గతం చేస్తూ పాలకుల్లో ఆందోళన కలిగిస్తోందని హరినాథ్ వ్యాఖ్యానించారు.