BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 04 June 2026, 03:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కామవరపుకోటలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ – చంద్రబాబు మేనిఫెస్టో ప్రతుల దహనం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 03:41 PM
102 వీక్షణలు

మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా కామవరపుకోటలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో “చంద్రబాబుకు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమం భారీ ర్యాలీతో జరిగింది. చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జి కంభం విజయరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ర్యాలీ అనంతరం చంద్రబాబు మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు.

ఈ సందర్భంగా కంభం విజయరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. సూపర్ సిక్స్ సహా ప్రధాన ఎన్నికల హామీలు పూర్తిగా నిలబెట్టుకోలేదని ఆరోపించారు.

రాష్ట్రంలో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, రైతులు మరియు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలని కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.