BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 19 April 2026, 06:38 pm
Posted by : బోధపల్లి వేణు

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 06:38 PM
161 వీక్షణలు

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి వేణు

వడ్డేకోతపల్లి గ్రామంలో కాంగ్రెస్‌లో భారీ చేరికలు – 200 మంది బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరిక..

పెద్దవంగర మండలం వడ్డేకోతపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు, ప్రముఖ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ భారీ చేరిక కార్యక్రమం గ్రామంతో పాటు మండల రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది..

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నేమురుగొమ్ముల వేణుగోపాల్ రావు, కావ్య దంపతులు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారితో పాటు బిఆర్ఎస్ పార్టీ వార్డు సభ్యులు బొల్లు ఊసయ్య, కేసబోయిన సుభాష్ చంద్ర రాజు, దంతపల్లి సతీష్, సోమరపు పరుశురాములు, దండుగుల సంధ్య శ్రీకాంత్ తదితరులు కూడా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మొత్తం 200 మందికి పైగా ఒకేసారి పార్టీ మారడం స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద బలంగా భావిస్తున్నారు..

ఈ చేరిక కార్యక్రమానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు కాంగ్రెస్ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, అవకాశాలు కల్పిస్తామని తెలిపారు..

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రజల ఆశయాలను నెరవేర్చడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు..

ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై విశ్వాసంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు..

ఈ భారీ చేరికలతో పెద్దవంగర మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరిందని, రాబోయే రోజుల్లో పార్టీ కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం రాబోయే రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు..