BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 11 April 2026, 11:32 am
Posted by : ఉపారపు లక్ష్మణ్

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
11 Apr, 2026 - 11:32 AM
121 వీక్షణలు

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు: కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి:

రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో ధర్మపురి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. శనివారం (11-04-2026) నాడు కటికనపల్లి గ్రామానికి చెందిన పలువురు కీలక నాయకులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన వారు:

కటికనపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రస్తుత వార్డు సభ్యులు అయిన అనపురం వెంకటేష్ (10వ వార్డు మెంబర్) మరియు మల్లెతుల రవి (04వ వార్డు మెంబర్) తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అభివృద్ధిని చూసే చేరికలు:

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు ధర్మపురి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.

పాల్గొన్న నాయకులు:

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోనగిరి అజయ్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ రామడుగు గంగ రెడ్డి, నాయకులు చేపూరి శేఖర్, ఈదుల రాజేందర్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.