BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 18 June 2026, 06:33 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కాణిపాకం వరసిద్ధి వినాయక స్థల పురాణం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 06:33 AM
227 వీక్షణలు

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో బాహుదా నది ఒడ్డున వెలసిన అత్యంత పవిత్రమైన స్వయంభూ వినాయక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో మూడు అవిటితనాలతో బాధపడుతున్న ముగ్గురు అన్నదమ్ములు జీవించేవారు వారికి ఉన్న పావు ఎకరం పొలం “కాణి”గా పిలువబడేది కరువు సమయంలో నీటి కోసం ఆ పొలంలో బావి తవ్వుతుండగా ఒక పెద్ద శిల తగిలి కోపంతో దానిని కొట్టిన వెంటనే ఆ శిల నుండి రక్తం కారినట్లు ద్రవం ప్రవహించిందని చెబుతారు ఆ అద్భుత సంఘటనతో గ్రామమంతా భయభక్తులతో నిండిపోయింది అదే క్షణంలో ఆ ముగ్గురు అన్నదమ్ముల అవిటితనం తొలగిపోయి మాట వినికిడి చూపు లభించిందని స్థల పురాణం పేర్కొంటుంది అనంతరం ఆ బావిలో వెలసిన శిల స్వయంభూ వినాయక స్వామిగా గుర్తించబడింది కాలక్రమంలో భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు చెప్పుకుంటే అవి నెరవేరుతాయని విశ్వాసం పెరగడంతో స్వామికి వరసిద్ధి వినాయకుడు అనే పేరు స్థిరపడింది గర్భగుడిలోని బావి నీరు ఎప్పటికీ తగ్గదని స్వామి విగ్రహం పెరుగుతుందని బాహుదా నది వరదలు వచ్చినా గర్భగుడిలోకి నీరు రాదని వంటి విశిష్ట విశ్వాసాలు భక్తుల్లో బలంగా నిలిచాయి ఇదే కాణిపాకం స్థల పురాణం భక్తి విశ్వాసం అద్భుతాల సమ్మేళనంగా ఈ క్షేత్రం నిలుస్తోంది.