BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 15 April 2026, 09:50 am
Posted by : కూనురు మధు

కారులో చిక్కుకొని ఐదేళ్ల చిన్నారి మృతి

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
15 Apr, 2026 - 09:50 AM
271 వీక్షణలు

కారులో చిక్కుకొని ఐదేళ్ల చిన్నారి మృతి NTODAY NEWS నార్కట్‌పల్లి

నార్కట్‌పల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పేర్ని సతీష్ కుమార్తె చేరన్య (5) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికులను కలచివేసింది. వివరాల ప్రకారం, చిన్నారి ఉదయం ఇంటి ముందు ఆడుకోవడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లి నాగదన గాయత్రి కుటుంబ సభ్యులతో కలిసి పాప కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు.మధ్యాహ్నం సుమారు 1:15 గంటల సమయంలో ఇంటి ముందు పార్క్ చేసిన కారులో చిన్నారి ఆపస్మారక స్థితిలో పడిఉండగా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి ఎస్సై పి. విష్ణుమూర్తి ఆసుపత్రికి చేరుకుని ఘటనపై విచారణ ప్రారంభించారు. చిన్నారి తల్లి నాగదన గాయత్రి ఫిర్యాదు మేరకు అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బాధిత కుటుంబానికి కాపీ అందజేశారు.చిన్నారి మృతిపై గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కారులో ఎంతసేపు ఉన్నది, ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరేదైనా కారణమా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.