BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 18 March 2026, 04:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

టీడీపీ జనార్ధనవరం గ్రామానికి చెందిన వెంకటరత్నం చికిత్సకు రూ.1.79 లక్షల సహాయం.

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 04:03 PM
218 వీక్షణలు

ఏలూరు జిల్లా :- నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో మానవత్వం మరోసారి మెరిసింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొత్తపల్లి వెంకటరత్నం బ్రెయిన్‌లో నరాలు చిట్లి బ్లడ్ బ్లీడింగ్ అవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురై, నోటిమాట రాకుండా, కాలు-చేయి పనిచేయని పరిస్థితికి చేరుకున్నారు. వెంటనే ఆయనను విజయవాడలోని స్వర హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, తన మనసున్న మహారాజుగా మరోసారి నిలిచారు. ఆయన సహకారంతో పాటు గ్రామ టిడిపి అధ్యక్షులు మదాసు చిన్నపుల్లయ్య, చాట్రాయి మండల టిడిపి అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు కలిసి ముందుకు వచ్చారు.

గ్రామ టిడిపి ప్రధాన కార్యదర్శి బలువూరి రత్తయ్య ప్రభాకర్ ఆధ్వర్యంలో రూ.1,79,095 (లక్ష డెభై తొమ్మిది వేల తొంభై ఐదు రూపాయలు) విలువైన ఎల్వోసి చెక్కును వెంకటరత్నం కుమారుడు కొత్తపల్లి మురళికి అందజేశారు.

పార్టీ కార్యకర్త కష్టాల్లో ఉన్నప్పుడు తమవారిగా నిలబడటం తెలుగుదేశం పార్టీ సాంప్రదాయం అని నాయకులు పేర్కొన్నారు. గ్రామస్థులు, పార్టీ నాయకులు ఈ సహాయాన్ని అభినందిస్తూ, వెంకటరత్నం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.