BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 April 2026, 06:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కేజీ బేసిన్ గ్యాస్‌పై రాష్ట్రానికి 50 శాతం హక్కు ఇవ్వాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 06:41 PM
212 వీక్షణలు

కేజీ బేసిన్ గ్యాస్‌పై రాష్ట్రానికి 50 శాతం హక్కు ఇవ్వాలి – అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్

కృష్ణా–గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తరించిన కేజీ బేసిన్ సహజ వాయువు సంపదపై ఆంధ్రప్రదేశ్‌కు న్యాయమైన వాటా కల్పించాలని అఖిల భారత కిసాన్ మహాసభ నాయకులు దినవహి హరినాథ్ డిమాండ్ చేశారు. “మన గ్యాస్ – మన హక్కు” అనే నినాదంతో రాష్ట్ర అసెంబ్లీలో 50 శాతం వాటా కోసం తీర్మానం చేయాలని ఆయన కోరారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్, ఇంధన ధరలు పెరిగి ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందన్నారు. గ్యాస్ ధరల పెరుగుదలతో హోటళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడగా, ఎరువుల ధరలు పెరిగి రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. పెట్రోలు ధరల పెరుగుదల కారణంగా రవాణా ఖర్చులు అధికమై నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సహజ న్యాయ సూత్రాల ప్రకారం రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే సహజ వనరులు ముందుగా రాష్ట్ర అవసరాలకు వినియోగించాలన్నారు. 12వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం సహజ వాయువులో 50 శాతం సంబంధిత రాష్ట్రాలకు కేటాయించాలనే నిబంధన అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 1978లో నరసాపురం సమీపంలో చమురు, గ్యాస్ అన్వేషణ ప్రారంభమై సహజ వాయువు కనుగొనబడిందని, తరువాత తాటిపాకలో మినీ శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయబడిందని వివరించారు. అనంతరం కేంద్రం తీసుకొచ్చిన నూతన అన్వేషణ విధానాల వల్ల ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పించబడటంతో కేజీ బేసిన్ గ్యాస్‌పై ప్రైవేటు సంస్థల ఆధిపత్యం పెరిగిందన్నారు.

కేజీ బేసిన్ ప్రాజెక్ట్‌లో భాగంగా లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని విమర్శించారు. వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేదంటే ప్రాజెక్టును జాతీయీకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు గ్యాస్ కొరత కారణంగా నిలిచిపోయాయని, అయినప్పటికీ ప్రభుత్వం ఆర్థిక భారం భరిస్తోందన్నారు. గ్యాస్ సరఫరా జరిగితే విద్యుత్ కొరత తగ్గి రాష్ట్రానికి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.

గ్యాస్ తవ్వకాల వల్ల తీరప్రాంత ప్రజలు పర్యావరణ సమస్యలు, భూగర్భ మార్పులు, పొలాల నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కష్టాలు రైతులవిగా ఉండగా లాభాలు కంపెనీలకు వెళ్లడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను దూర రాష్ట్రాలకు తరలించడం అన్యాయమని, ముందుగా రాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాలని కోరారు. గ్యాస్‌ను రవాణా రంగం, గృహ అవసరాలకు వినియోగిస్తే ఖర్చులు తగ్గడమే కాక పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు.

అమరావతి రాజధాని కోసం జరిగినట్లే కేజీ బేసిన్ గ్యాస్ విషయంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పోరాడాలని దినవహి హరినాథ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సహజ వనరులపై హక్కు సాధించుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు.