BREAKING
thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
Date of Publish : 19 July 2026, 06:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: ఎస్ఎఫ్ఐ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 06:53 PM
114 వీక్షణలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: ఎస్ఎఫ్ఐ

తిరువూరు, జూలై 19: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ తిరువూరు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బోసు బొమ్మ బస్‌స్టాప్ సెంటర్‌లో విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడు పంతంగి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్‌చుక్ గత 21 రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు.

ఆయన చేపట్టిన శాంతియుత దీక్షను భంగం చేసి పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని విమర్శించారు. ప్రభుత్వం దీక్షను భంగం చేసినప్పటికీ ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం. సాజీ, అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషే ఘౌష్ ఉద్యమాన్ని కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ నాయకుడు బి. వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం. రాఖీ, వర్ధన్, జగదీష్, బాలు, సాయి, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.