BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 28 June 2026, 01:13 pm
Posted by : బాల్ధా భాస్కర్

MRPS: కొండమడుగులో 53వ వారపు జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహణ

తెలంగాణ
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
28 Jun, 2026 - 01:13 PM
139 వీక్షణలు

కొండమడుగు | NTODAY NEWS

కొండమడుగు గ్రామంలో ఆదివారం ఎంఆర్పీఎస్ (MRPS) గ్రామ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద 53వ వారపు జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జ్ఞానమాల కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. నేటి యువత అంబేడ్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు.

డాక్టర్ అంబేడ్కర్ తన అపారమైన జ్ఞానం, దూరదృష్టితో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని పేర్కొంటూ, యువత మహనీయుల అడుగుజాడల్లో నడిచి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం నిర్వహించే జ్ఞానమాల కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని అంబేడ్కర్ భావజాలాన్ని మరింత విస్తృతంగా చాటాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు, వార్డు సభ్యుడు కాడిగళ్ల బాబురావు, వార్డు సభ్యురాలు ఆర్ముల్లా లావణ్య శ్రీకాంత్, మంద భాస్కర్, బొడ్డు రజిత భాస్కర్, కడెం అశోక్, మాజీ సర్పంచ్ శివగళ్ల ఇస్తరి, మాజీ వైస్ ఎంపీపీ వాకిటి గణేష్ రెడ్డి, భూషపాక మల్లేష్, మాజీ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు చిన్నగల్ల అశోక్, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు చిన్నగల్ల లింగస్వామి, మాజీ ఎంపీటీసీ కడెం చంద్రశేఖర్, మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ కనకపోయిన రాజమల్లేష్, కనకపోయిన గోపాల్, చిన్నగల్ల గణేష్, బొడ్డు శివబాబు, అడిపే ఆంజనేయులు, కడెం బీరప్ప, శివగళ్ల ధనరాజ్, కొమ్ము భాస్కర్, ఎండి మున్నా, కనకపోయిన నవీన్, కడెం శ్రీకాంత్, ఎరుపుల సుక్కయ్య, కడెం నరసింహ, బద్దం బాబు, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.