BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 28 June 2026, 02:38 pm
Posted by : బాల్ధా భాస్కర్

Pulse Polio: కొండమడుగులో పల్స్ పోలియో కార్యక్రమం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని పిలుపు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
28 Jun, 2026 - 02:38 PM
172 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా, కొండమడుగు | NTODAY NEWS

కొండమడుగు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ పాలకవర్గం, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండమడుగు వార్డు సభ్యులు బొడ్డు రజిత మరియు హరి శంకర్ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లలు ఆరోగ్యంగా, సంపూర్ణ జీవితాన్ని గడపాలంటే పోలియో చుక్కలు ఎంతో కీలకమని తెలిపారు.

పోలియో రహిత భారతదేశ నిర్మాణంలో ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలని, పిల్లల భవిష్యత్తుకు మనం అందించే అత్యంత విలువైన కానుక ఆరోగ్యం అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.