BREAKING
thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Date of Publish : 19 July 2026, 07:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొండపర్వలో మంగళ్ పాండే జయంతి ఘనంగా నిర్వహింపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 07:32 PM
125 వీక్షణలు

కొండపర్వలో మంగళ్ పాండే జయంతి ఘనంగా నిర్వహింపు

విస్సన్నపేట, జూలై 19: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే జయంతిని ప్రముఖ సామాజిక కార్యకర్త, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి బోట్ల శివ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బోట్ల శివ సత్యనారాయణ మంగళ్ పాండే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, 1857 తొలి స్వాతంత్ర్య సంగ్రామంలో వీరోచితంగా పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు మంగళ్ పాండే అని కొనియాడారు. ఆయన త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, దేశభక్తి, త్యాగస్ఫూర్తికి మంగళ్ పాండే చిరస్మరణీయ ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.

నేటి యువత మంగళ్ పాండే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని బోట్ల శివ సత్యనారాయణ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు దాసరి శివ, మరీదు ఉమామహేశ్వరరావు, వెంకన్న, బాలాజీ దుర్గ, మల్లేశ్వరరావు, కృష్ణవేణి, విద్యార్థులు యామిని, సాయి, మౌనిక, సత్యనారాయణ, మానస తదితరులు పాల్గొని మంగళ్ పాండేకు నివాళులర్పించారు.