BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 April 2026, 07:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కోటపాడు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 07:53 PM
159 వీక్షణలు

కోటపాడు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం – నెరవేరుతున్న చిరకాల కోరిక

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ రహదారి నిర్మాణం ఇప్పుడు కార్యరూపం దాల్చడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం 1300 మీటర్ల పొడవుతో రూ.70 లక్షల వ్యయంతో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా తూర్పు బజార్ రోడ్ వరకు 650 మీటర్ల పొడవు, సుమారు 3.7 మీటర్ల వెడల్పుతో రూ.35 లక్షల వ్యయంతో పనులు జరుగుతున్నాయి.

గతంలో ఈ రహదారి బురదమయం, గుంతలతో ఉండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలు దాదాపు అసాధ్యంగా మారి విద్యార్థులు, వృద్ధులు, రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొనేవారు.

ఈ సమస్యను గుర్తించిన టీడీపీ నాయకుడు మంచిన పూర్ణ చంద్రరావు, మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన మంత్రి నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం ఆ నిధులతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

పనులు పూర్తయిన తర్వాత గ్రామంలో రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడి, ప్రజల దైనందిన జీవితం సులభతరం కానుంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరఫున మోరంపూడి జయరాం కృతజ్ఞతలు తెలిపారు.

ఇంకా గ్రామంలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం మిగిలి ఉందని, అది కూడా పూర్తయితే కోటపాడు గ్రామంలో రవాణా సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.