BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 12 May 2026, 05:15 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కోటపాడులో తరచూ కరెంటు కోతలు.. ప్రజల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 May, 2026 - 05:15 AM
180 వీక్షణలు

కోటపాడులో తరచూ కరెంటు కోతలు.. ప్రజల ఆగ్రహం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో తరచూ జరుగుతున్న కరెంటు కోతలతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా రాత్రి సమయాల్లో స్వల్ప గాలి వీచినప్పటికీ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.

కరెంటు లేకపోవడంతో చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దోమల బెడద పెరిగి జ్వరాల బారిన పడుతున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. గంటల తరబడి విద్యుత్ లేకపోవడంతో ఇన్వర్టర్లు కూడా పనిచేయకుండా డౌన్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు రెండు గంటలకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇళ్లలో ఉండలేక బయట రోడ్డుపై ఆరుబయట కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు నిలిచిపోయిన కరెంటు ఆదివారం ఉదయం పది గంటలైనా పునరుద్ధరించకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు మండిపడ్డారు.

ఇలాంటి తీవ్ర కరెంటు కోతలు గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్న గ్రామస్తులు, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.