BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 April 2026, 04:49 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో 14 ఏళ్ల బాలికపై దారుణం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
05 Apr, 2026 - 04:49 AM
140 వీక్షణలు

పుంగనూరులో 14 ఏళ్ల బాలికపై దారుణం – నిందితుడికి కఠిన శిక్ష కోరుతూ కుటుంబ సభ్యుల ఆవేదన

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం నల్లగుట్లపల్లి తాండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన రాంబాబు (35) తనకు వరుసకు చిన్నాయన అయిన 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సమాచారం ప్రకారం, రాంబాబు బాలికతో కలిసి ప్రభుత్వ ఎఫ్‌సి షాపులో బియ్యం తీసుకుని ఆటోలో తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. అనంతరం బాలికను గ్రామంలో దింపి, అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

గ్రామానికి చేరుకున్న బాలిక ఏడుస్తూ జరిగిన ఘటనను తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

“మా బిడ్డ జీవితం పాడు చేసిన రాంబాబుకు ఉరి శిక్ష విధించాలి. మా కూతురికి న్యాయం చేయాలి” అని బాధితురాలి తల్లి వేడుకుంటోంది.

ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.