BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 21 August 2026, 08:23 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొత్త ఓటర్ల నమోదుకు శ్రీకారం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 08:23 AM
135 వీక్షణలు

కొత్త ఓటర్ల నమోదుకు శ్రీకారం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి

18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకునేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. 01 అక్టోబర్ 2008 లేదా అంతకు ముందు జన్మించిన వారు కొత్త ఓటరు నమోదుకు అర్హులు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ప్రతి అర్హుడు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఓటరు నమోదుకు ఆధార్ కార్డు, జనన ధృవీకరణ పత్రం లేదా పదో తరగతి మెమో లేదా బదిలీ ధృవీకరణ పత్రం, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, కుటుంబ సభ్యుల్లో ఒకరి ఓటరు గుర్తింపు కార్డు, మొబైల్ నంబర్ అవసరం ఉంటుంది. అర్హత కలిగిన వారు గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాలు లేదా ఎన్‌వీఎస్‌పీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మీ ఓటు - మీ హక్కు... ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.