BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 15 August 2026, 01:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కరీంనగర్‌లో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో వందేమాతరం గీతం కార్డుల పంపిణీ

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Aug, 2026 - 01:59 PM
59 వీక్షణలు

కరీంనగర్‌లో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో వందేమాతరం గీతం కార్డుల పంపిణీ

కరీంనగర్: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో వందేమాతరం పూర్తి గీతం కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్, సప్తగిరి పాఠశాలలకు చెందిన 1200 మంది విద్యార్థులకు ఈ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజ్ఞాభారతి రాష్ట్ర గవర్నర్ కౌన్సిల్ సభ్యుడు ఎల్. రాజ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 1870లో బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను ఏకం చేసిన మహా రణనినాదంగా నిలిచిందని తెలిపారు. ఈ గీతం దేశభక్తికి, మాతృభూమిపై ఉన్న గౌరవానికి ప్రతీకగా మారిందని వివరించారు.

భారత ప్రభుత్వం వందేమాతరం గీతాన్ని గౌరవనీయమైన జాతీయ గేయంగా స్వీకరించిందని పేర్కొన్నారు. యువతలో దేశభక్తి భావాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి కోశాధికారి జె. సత్యనారాయణ, సహాయ కార్యదర్శి వెచ్చా మురళి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.