BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 March 2026, 09:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

క్రమశిక్షణతో చదివితేనే విజయపథం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 09:44 PM
145 వీక్షణలు

క్రమశిక్షణతో చదివితేనే విజయపథం: విశ్రాంత ప్రొఫెసర్ నాగేశ్వరరావ

విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో మంచి ఫలితాలు సాధించగలరని ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ రామాల నాగేశ్వరరావు తెలిపారు.

శుక్రవారం గంపలగూడెం మండలం పెనుగొలను ప్రాథమిక మెయిన్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ‘విద్యార్థుల క్రమశిక్షణ’ అనే అంశంపై ప్రసంగించారు. చదువుతో పాటు మంచి అలవాట్లు, సమయపాలన, క్రమశిక్షణ విద్యార్థుల భవిష్యత్తును నిర్మిస్తాయని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సోదరి కోటమ్మ పాఠశాలకు రూ.33 వేల విలువైన మైక్ సెట్, సౌండ్ బాక్స్‌లను అందజేసినట్లు ప్రధానోపాధ్యాయుడు యోహాను తెలిపారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ప్రొఫెసర్ నాగేశ్వరరావును శాలువా కప్పి ఘనంగా సన్మానించింది.

ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్‌ఎం దుర్గాప్రసాద్, విశ్రాంత ఎంఈఓ శేషిరెడ్డి, నంబూరి శ్రీనివాసరావు, తొండెపు నాగేశ్వరరావు, వూటుకూరు నారాయణరావు, దేవరపల్లి రమేష్, ఆదూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.