BREAKING
హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు
www.ntodaynews.com

కర్నూలు అభివృద్ధికి విభజన హామీ నిధులు వెంటనే విడుదల చేయాలి

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 08:03 PM
8 వీక్షణలు

కర్నూలు అభివృద్ధికి విభజన హామీ నిధులు వెంటనే విడుదల చేయాలి

జిల్లాను ఇండస్ట్రీ కారిడార్‌గా తీర్చిదిద్దాలి: బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షులు గడ్డం నాగేంద్ర

కర్నూలు జిల్లా అభివృద్ధికి రాష్ట్ర విభజన హామీల కింద రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని, జిల్లాను పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయాలని బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షులు గడ్డం నాగేంద్ర డిమాండ్ చేశారు.

ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లేకల్ గ్రామంలో బహుజన సేన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా సభల సన్నాహక పర్యటనలో భాగంగా గ్రామ ప్రజలు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాకు రావాల్సిన విభజన హామీలు, నిధులు, నీటి ప్రాజెక్టులు, మౌలిక వసతులపై ప్రజలకు వివరించారు.

గడ్డం నాగేంద్ర మాట్లాడుతూ.. 2014 రాష్ట్ర విభజన అనంతరం కర్నూలు జిల్లాకు దక్కాల్సిన నిధులు, అభివృద్ధి అవకాశాలను సాధించేందుకు ప్రజలు ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కర్నూలును వెనుకబడిన ప్రాంతంగా కాకుండా పరిశ్రమల కేంద్రంగా, ఇండస్ట్రీ కారిడార్‌గా అభివృద్ధి చేసి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు, ప్రతి గ్రామానికి సురక్షిత తాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటి వనరుల అభివృద్ధి ద్వారానే రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు.

కర్నూలు జిల్లాకు రావాల్సిన నిధులు, విభజన హామీలు, పరిశ్రమలు, మౌలిక వసతుల అంశాలపై గ్రామ ప్రజలకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. ప్రజలు తమ హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం, కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం బహుజన సేన సమితి నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని గడ్డం నాగేంద్ర స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బహుజన సేన సమితి నాయకులు భీమా నాయక్, ధర్మేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ఎం. జట్టప్పతో పాటు బిల్లేకల్ గ్రామ ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.