BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 27 March 2026, 11:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కుళ్లిన చికెన్ స్వాధీనం – నిందితుడి అరెస్ట్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 11:09 PM
186 వీక్షణలు

కుళ్లిన చికెన్ స్వాధీనం – నిందితుడి అరెస్ట్

హైదరాబాద్, మార్చి 27: నగరంలోని మూసాపేట పరిధి భరత్‌నగర్‌లో ఆహార భద్రతా విభాగం, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా కుళ్లిన చికెన్ బయటపడింది. ఈ సందర్భంగా సూరజ్ పాల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి సుమారు 352 కిలోల పాడైన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అధికారుల వివరాల ప్రకారం, నిందితుడు ఈ మాంసాన్ని అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ ఉంచి, స్థానిక హోటళ్లు మరియు చికెన్ విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వినియోగానికి అనర్హమైన ఈ మాంసం వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దర్యాప్తులో భాగంగా, నిందితుడి వద్ద ఉన్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ గడువు కూడా ముగిసినట్లు వెల్లడైంది. ఘటనపై కేసు నమోదు చేసి మరింత విచారణ కొనసాగిస్తున్నారు. అధికారులు ప్రజలు మాంసం కొనుగోలు సమయంలో నాణ్యత, పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.