BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 June 2026, 06:32 pm
Posted by : M. రాజశేఖర్

కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
07 Jun, 2026 - 06:32 PM
163 వీక్షణలు

కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్

కుప్పం పట్టణంలో అవెంజర్స్ జిమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5 కిలోమీటర్ల రన్ (5K Run) విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కుప్పం, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి వచ్చిన యువతతో పాటు మొత్తం 100 మందికి పైగా రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పోటీలో తిరుపతికి చెందిన భగవత్ దీప్ ప్రథమ స్థానం సాధించగా, కుప్పంకు చెందిన పవన్ ద్వితీయ స్థానం, బెంగళూరుకు చెందిన తరుణ్ తృతీయ స్థానం దక్కించుకున్నారు. విజేతలకు ట్రోఫీలు మరియు బహుమతులను లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ సలహాదారు లయన్ ఎ. మహేష్ అందజేశారు.

ఈ కార్యక్రమానికి శ్రీ కృష్ణ జ్యువెలర్స్ నిర్మల్,  యువ వ్యాపారవేత్తలు  హేమేష్ మరియు శశికుమార్ స్పాన్సర్లుగా వ్యవహరించి తమ వంతు సహకారాన్ని అందించారు.

కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన గజేంద్ర మరియు అవెంజర్స్ జిమ్ బృందాన్ని పలువురు అభినందించారు. యువతలో ఆరోగ్య చైతన్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పాల్గొన్న వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విజేతలకు, పాల్గొన్న ప్రతి రన్నర్‌కు అభినందనలు తెలియజేస్తూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గజేంద్ర మరియు అవెంజర్స్ జిమ్ టీమ్‌కు ప్రత్యేక ప్రశంసలు అందజేశారు.