BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 March 2026, 06:53 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లాసెట్’కు డెడ్‌లైన్… రేపే చివరి రోజు! అభ్యర్థులు అప్రమత్తం!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 06:53 AM
148 వీక్షణలు

లాసెట్’కు డెడ్‌లైన్… రేపే చివరి రోజు! అభ్యర్థులు అప్రమత్తం!

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ లాసెట్, పీజీఎల్సెట్ – 2026 దరఖాస్తుల గడువు రేపటితో (మార్చి 20) ముగియనుంది. మూడు సంవత్సరాల, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, అలాగే ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో చేరదలచిన అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ప్రవేశ పరీక్షను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మే 4న నిర్వహించనున్నారు. కోర్సును బట్టి దరఖాస్తు రుసుము నిర్ణయించబడింది.

గడువు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ముఖ్య గమనిక:

గడువు తర్వాత ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసే అవకాశం ఉన్నప్పటికీ, అదనపు చార్జీలు తప్పవు.