BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 16 June 2026, 06:09 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లేడీ పోలీస్ ముసుగులో భారీ చీటింగ్ – చెన్నైలో వెలుగులోకి షాకింగ్ స్కామ్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jun, 2026 - 06:09 AM
153 వీక్షణలు

సమాజంలో నేరం జరిగితే ప్రజలు ముందుగా ఆశ్రయించేది పోలీస్ స్టేషన్. ఖాకీ చొక్కాపై ఉన్న నమ్మకమే వారికి భరోసా. కానీ అదే ఖాకీ ముసుగులో మోసం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో చూపిన ఘటన చెన్నైలో వెలుగుచూసింది.

చెన్నై రాయపురం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న షీలా మేరీ అనే మహిళా అధికారి తన బంధువు ప్రభుమణితో కలిసి భారీ పెట్టుబడి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

2023 నుంచి 2024 మధ్యకాలంలో వీరిద్దరూ “బంగారంపై పెట్టుబడి పెడితే తక్కువ ధరకే నాణేలు ఇస్తాం, మార్కెట్ కంటే ఎక్కువ లాభాలు వస్తాయి” అంటూ ఒక స్కీమ్‌ను ప్రచారం చేసినట్లు సమాచారం. నమ్మకం కలిగించేందుకు అధికారిక పోలీస్ వాహనాన్ని కూడా ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఎన్నికల సమయంలో అదే పోలీస్ వాహనంలో బంగారు నాణేలు పంపిణీ చేయడంతో ప్రజలు మరింతగా నమ్మి పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని సుమారు 200 మందికి పైగా వ్యక్తులు దాదాపు రూ.20 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.

తర్వాత ఈ వ్యవహారం బయటపడటంతో ప్రభుమణిని అధికారులు అరెస్ట్ చేయగా, ఇన్‌స్పెక్టర్ షీలా మేరీపై కూడా కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ ఆర్థిక మోసం కేసుపై ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు కొనసాగిస్తోంది.