BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 18 April 2026, 05:43 pm
Posted by : V శ్రీనివాస్

​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 Apr, 2026 - 05:43 PM
155 వీక్షణలు

​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం: DAC నంబర్ వచ్చినా అందని సిలిండర్లు!

లక్షెట్టిపేటలోని ఒక గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారిందని, డీఏసీ (DAC) నంబర్ వచ్చి వారం గడుస్తున్నా వినియోగదారులకు గ్యాస్ అందడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో నిబంధనల పేరుతో డీఏసీ ఉంటేనే లోపలికి అనుమతించిన సిబ్బంది, ఇప్పుడు సిలిండర్ల కోసం వస్తే యజమాని ఆదేశాలు ఉంటేనే ఇస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, యజమాని కూడా ఫోన్లకు స్పందించడం లేదని వారు వాపోతున్నారు. ఖాళీ సిలిండర్ తీసుకువచ్చినా రసీదు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోందని, నిబంధనల ప్రకారం పట్టణాల్లో 25 రోజులు, పల్లెల్లో 45 రోజులకు ఒకసారి సిలిండర్ సరఫరా చేయాల్సి ఉన్నా ఇక్కడ మాత్రం ఆ నిబంధనలు తుంగలో తొక్కారని మండిపడుతున్నారు. మంజూరైన సిలిండర్లను పలుకుబడి ఉన్న వారికి అక్రమంగా మళ్లిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ, బాధితులంతా ఏకమై ఏజెన్సీ వద్ద నిరసన తెలపాలని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్యాస్ పంపిణీని క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు