BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 April 2026, 06:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లక్ష్యాన్ని దాటిన వసూళ్లు...

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 06:34 PM
188 వీక్షణలు

లక్ష్యాన్ని దాటిన వసూళ్లు.. చింతలపూడి మార్కెట్ కమిటీకి ఎమ్మెల్యే ప్రశంసలు

ఏలూరు జిల్లా చింతలపూడి మార్కెట్ కమిటీ లక్ష్యాన్ని మించి మార్కెట్ ఫీజు వసూలు చేసి జిల్లాలో అగ్రస్థానాన్ని నిలుపుకోవడంపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాలకవర్గాన్ని అభినందించారు.

సోమవారం స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో గౌరవాధ్యక్షునిగా ఎమ్మెల్యే  సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో చింతలపూడి మార్కెట్ కమిటీ నిలవాలని, ఆ దిశగా పాలకవర్గ సభ్యులు మరింత కృషి చేయాలని సూచించారు.

రాష్ట్రంలోని పెద్ద మార్కెట్ కమిటీల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించి, చింతలపూడి కమిటీ ఆదాయాన్ని ఇంకా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ దుర్గా పార్వతి మధు బాబు మాట్లాడుతూ, ఏడు చెక్‌పోస్టుల ద్వారా రూ.5.30 కోట్లు, కార్యాలయం ద్వారా రూ.3 కోట్లు కలిపి మొత్తం రూ.8.5 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు చేసినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో వైస్ చైర్మన్‌తో పాటు మార్కెటింగ్ డైరెక్టర్ మరియు ఇతర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.