BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

లోన్‌కు ష్యూరిటీ ఇస్తే జాగ్రత్త.. ష్యూరిటీదారుడికీ సమాన బాధ్యతే

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 May, 2026 - 03:46 PM
45 వీక్షణలు

లోన్‌కు ష్యూరిటీ ఇస్తే జాగ్రత్త.. ష్యూరిటీదారుడికీ సమాన బాధ్యతే: ఏపీ హైకోర్టు కీలక తీర్పు

చిట్‌ఫండ్ సంస్థల నుంచి రుణం తీసుకున్న వ్యక్తితో పాటు ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తికీ సమాన బాధ్యత ఉంటుందని ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రుణగ్రహీత బకాయిలు చెల్లించకపోతే, నేరుగా ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తిపై కూడా రికవరీ చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అవసరమైతే ష్యూరిటీదారుడి జీతాన్ని కూడా జప్తు చేసే అధికారం చిట్‌ఫండ్ సంస్థలకు ఉంటుందని తెలిపింది.

చిట్‌ఫండ్ చట్టంలో ముందుగా రుణం తీసుకున్న వ్యక్తి నుంచి మాత్రమే బకాయిలు వసూలు చేయాలనే నిబంధన లేదని కోర్టు పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి కూడా రుణానికి పూర్తి బాధ్యత వహించాల్సిందేనని వ్యాఖ్యానించింది. ష్యూరిటీ వల్లే రుణం మంజూరు అవుతుందని, అందుకే రుణగ్రహీతతో సమానంగా ష్యూరిటీదారుడికీ బాధ్యత ఉంటుందని తెలిపింది.

అలాగే డిప్యూటీ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌, జాయింట్ రిజిస్ట్రార్‌లు కూడా చిట్‌ఫండ్ చట్టంలోని “రిజిస్ట్రార్” నిర్వచనంలోకి వస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. రికవరీ సర్టిఫికెట్ జారీ చేసే అధికారం వారికి ఉంటుందని, వారు ఇచ్చే సర్టిఫికెట్ సివిల్ కోర్టు డిక్రీతో సమానమని పేర్కొంది.

గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కంబాల వెంకట రామారావు, ఓ వ్యక్తి తీసుకున్న కపిల్ చిట్‌ కోస్టా ప్రైవేట్ లిమిటెడ్ చిట్టీకి ష్యూరిటీగా ఉన్నారు. రుణగ్రహీత డబ్బులు చెల్లించకపోవడంతో డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ రికవరీ సర్టిఫికెట్ జారీ చేశారు. అనంతరం గుంటూరు జూనియర్ సివిల్ కోర్టు 2025లో రామారావు జీతాన్ని జప్తు చేస్తూ వారెంట్ జారీ చేసింది.

దీనిపై రామారావు హైకోర్టును ఆశ్రయించారు. “రుణగ్రహీత ఆర్థికంగా బాగానే ఉన్నా, అతనిపై చర్యలు తీసుకోకుండా నాపై నేరుగా రికవరీ చర్యలు ప్రారంభించడం చట్టవిరుద్ధం” అని వాదించారు. అలాగే రికవరీ సర్టిఫికెట్ జారీ చేసే అధికారం చిట్ రిజిస్ట్రార్‌కే ఉంటుందని, డిప్యూటీ రిజిస్ట్రార్ ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లదని పేర్కొన్నారు.

అయితే చిట్‌ఫండ్ సంస్థ తరఫు న్యాయవాది, ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి కూడా రుణ బాధ్యతలో భాగస్వామేనని వాదించారు. రుణగ్రహీత చెల్లించకపోతే ష్యూరిటీదారుడి నుంచి వసూలు చేయడం చట్టబద్ధమేనని తెలిపారు.

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, రామారావు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ తీర్పుతో ఇకపై ఎవరైనా లోన్ లేదా చిట్టీకి ష్యూరిటీ ఇవ్వాలంటే పూర్తి అవగాహనతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.