BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 November 2025, 05:30 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వేధింపులు నిరోధించటానికి కలసికట్టుగా కృషిచేద్దాం

తెలంగాణ
25 Nov, 2025 - 05:30 AM
334 వీక్షణలు
సమాజంలో మహిళలపై వేధింపులు నిరోధించటానికి కలసికట్టుగా కృషిచేద్దామని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు పిలుపునిచ్చారు ... NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్-కళ్యాణ్ కుమార్ ఏలూరు, నవంబరు 25: జాతీయ న్యాయసేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాలు మేరకు మంగళవారం అంతర్జాతీయ మహిళా వేధింపుల వ్యతిరేక దినోత్సవం సంధర్భంగా ఏలూరు మండల పరిషత్తు సమావేశ మందిరం నందు జిల్లాలోని సంబంధిత అధికారులతో అవగాహన సదస్సును నిర్వహించామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ మహిళలపై వేధింపులు తరచుగా జరుగుతున్నాయని, చైతన్యం పంతంచేస్తూ, నిరోధించటానికి చట్టాలను మరింత కఠినముగా అమలు చేస్తామని అన్నారు. నేటి సమాజంలో మహిళలు ఆన్లైన్ వేధింపులకు గురవుతున్నారని కావున చరవాణిలను ఉపయోగించే టప్పుడు మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానుతులు, అపరిచితుల నుండి ఫోను వచ్చినప్పటికీ స్పందించవద్దని సూచించారు. ఎవరిపైన సందేహం ఉన్నను దగ్గరలోని సైబర్ పోలీసు స్టేషన్ నందు ఫిర్యాదు చేయాలని సూచించారు. అవసరమైన వారికి జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఉచిత న్యాయ సహాయ అందిస్తుందని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 15100 ద్వారా ఉచిత సలహాలు పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ డెవలప్మెంటు మరియు చైల్డ్ వెల్ఫేరు ప్రాజెక్టు డైరెక్టరు ఏ.శారద, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసరు డా.సిహె.చ్. సూర్య చక్రవేణి, ఏలూరు తహశీల్దారు యన్.గాయత్రి దేవి, డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారి యన్.రవీంద్ర భారతి, ఎక్కువ సంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube