BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 26 June 2026, 06:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మాచర్లలో ఉద్రిక్తత.. కాన్పు అనంతరం నవవధువు మృతి, ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:46 PM
94 వీక్షణలు

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని రవితేజ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మాచర్ల మండలం సుబ్బారెడ్డి పాలెం గ్రామానికి చెందిన పుణ్యమూర్తి సిలువకుమారి (25) కాన్పు కోసం ఆసుపత్రిలో చేరగా, ఆడబిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే మృతి చెందింది. శిశువు క్షేమంగా ఉన్నప్పటికీ తల్లి మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

సిలువకుమారికి ఏడాది క్రితమే హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న విజయభాస్కర్‌తో వివాహం జరిగింది. మొదటి కాన్పులోనే ఈ విషాదం చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను కలచివేసింది.

వైద్యుల నిర్లక్ష్యం వల్లే సిలువకుమారి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించిన బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆగ్రహంతో ఆసుపత్రి అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.

మహిళ మృతికి గల అసలు కారణాలపై పోలీసులు, వైద్య అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం వైద్యుల నిర్లక్ష్యం ఆరోపణలు బంధువులవే కాగా, అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదు.