BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

మార్కాపురం డిఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహల గుర్తింపు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
28 Mar, 2026 - 02:54 PM
47 వీక్షణలు

మార్కాపురం డిఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహల గుర్తింపు 

డీఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా మృతదేహాల గుర్తింపు

అంబులెన్సుల ద్వారా శనివారం స్వస్థలాలకు తరలింపు

-వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడి


మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమై గుర్తుపట్టలేని విధంగా ఉన్న 14 మంది మృతదేహాలను తోబుట్టవుల డీఎన్ఏలతో గుర్తించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన జారీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఫోన్ ద్వారా మంత్రి సమీక్ష జరిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం శివారులో టిప్పర్ను ట్రావెల్స్ బస్సు గురువారం వేకువజామున ఢీకొట్టిన ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారు మృతదేహాలను మార్కాపురం జీజీహెచ్ లోని మార్చురీకి తరలించారు. వీటికి పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ మృతదేహాలు ఎవరివో గుర్తించలేని విధంగా ఉండడంతో గురువారం రాత్రి తోబుట్టువుల (మొత్తం 22 మంది) నుంచి గుంటూరు రీజినల్ పోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఆర్ఎస్ఎస్ఎల్) నిపుణులు రక్త నమూనాలు సేకరించారు గుంటూరు నుంచి వచ్చిన వారికి ఒంగోలు జీజీహెచ్లోని ఫోరెన్సిక్ డిపార్టుమెంటు వారు సహకరించారు. ప్రకాశం జిల్లా. కలెక్టర్ పి. రాజాబాబు నిపుణులతో సంప్రదింపులు జరిపారు వారికి అవసరమైన సదుపాయాలు కల్పించారు. తోబుట్టువుల నుంచి సేకరించిన నమూనాలను గుంటూరులోని ల్యాబ్లో పరీక్షించారు. సమష్టి కృషివల్ల ఫలితాలు శుక్రవారం రాత్రి వెలువడ్డాయి. వీటి ఆధారంగా మృతదేహాల గుర్తింపు కార్డులోని వివరాలతో అనుసంధానం చేస్తున్నారు. శనివారం ఉదయం నుంచి తోబుట్టవులకు మృతదేహాలను అప్పగిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసే అంబులెన్సుల ద్వారా స్వస్థలాలకు మృతదేహాలను ఎస్కార్ట్ సాయంతో పంపనున్నారు.కందుకూరు. కనిగిరి, ఒంగోలు, నెల్లూరు జిల్లా బుచ్చి వరకు మృతదేహాల తరలింపు జరగనుంది.

తగిన జాగ్రత్తలతో

డీఎన్ఏ పరీక్షల నిర్వహణలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. చనిపోయిన వారి తోబుట్టవుల (రక్త సంబంధీకులు) నుంచి నమూనాలు సేకరించారు ఒక కేసు విషయంలో తండ్రి, బిడ్డ చనిపోయ్యారు తండ్రిని ఆయన తల్లిదండ్రుల నుంచి సేకరించిన రక్త నమూనాలు, బిడ్డను తల్లి నుంచి సేకరించిన నమూనాను పరీక్షించడం ద్వారా మృతదేహాల గుర్తింపు సాధ్యమైంది. 

 ఇద్దరికి శస్త్ర చికిత్స

బస్సు ప్రమాదంలో గాయపడిన 20 మంది ఒంగోలు, మార్కాపురం అసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒంగోలు జీజీహెచ్లో 16 మంది, మార్కాపురం జీజీహెచ్లో 12 మంది, ప్రైవేటు ఆసుపత్రిలో ఒకరు చొప్పున చికిత్స పొందుతున్నారని అధికారులు మంత్రికి వివరించారు. ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి కాళ్లకు శుక్రవారం శస్త్రచికిత్స చేశారు అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పద్మావతి, ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు, మార్కాపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ వెల్లడించారు. వైద్యుల వైద్యుల సూచనలు అనుసరించి కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.