BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 March 2026, 07:31 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

​మాట నిలబెట్టుకున్న సర్పంచ్

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
22 Mar, 2026 - 07:31 PM
213 వీక్షణలు

​మాట నిలబెట్టుకున్న సర్పంచ్ .. ఆడపిల్ల పుడితే రూ. 5 వేల ఆర్థిక సాయం! కరుణాపురంలో ఆదర్శంగా నిలిచిన గుర్రపు రీనా ప్రవీణ్.

ధర్మసాగర్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చి ఒక సర్పంచ్ తన నిజాయితీని చాటుకున్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.

​ఎన్నికల హామీ నెరవేర్పు:

గత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గుర్రపు రీనా ప్రవీణ్ గ్రామంలో ఒక వినూత్న హామీ ఇచ్చారు. తన గ్రామంలో ఎవరికైనా ఆడపిల్ల పుడితే తన వంతుగా రూ. 5,000 ఆర్థిక సహాయం అందజేస్తానని మాటిచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం, తన మాటను నిలబెట్టుకుంటూ ఇటీవల గ్రామానికి చెందిన ఆకారపు హరీష్ – బిందు దంపతులకు ఆడపిల్ల జన్మించగా, వారికి రూ. 5,000 నగదును అందజేశారు.

​గ్రామస్తుల హర్షం:

ఆడపిల్ల పుట్టిన సంతోషంలో ఉన్న ఆ కుటుంబానికి ఈ ఆర్థిక సాయం అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం పేదలకు అండగా నిలవడం గొప్ప విషయమని కొనియాడారు. ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా, వారి పుట్టుకను ఒక పండుగలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రీనా ప్రవీణ్ తెలిపారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.