BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 March 2026, 09:49 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మదనపల్లి_బెంగుళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Mar, 2026 - 09:49 PM
141 వీక్షణలు

మదనపల్లి_బెంగుళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లా,మదనపల్లి- బెంగళూరు జాతీయ రహదారి చికిలబైల్ గ్రామ సచివాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.కుటుంబ సభ్యుల వివరాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... 

కర్ణాటక రాష్ట్రం,శ్రీనివాసపురం తాలూకా, రాయల్పాడు గ్రామం నుంచి మదనపల్లి రూరల్ మండలం చీకలబైల్ స్వగ్రామానికి దిచక్ర వాహనంలో  వస్తుండగా చీకలబైల్ గ్రామ సచివాలయం వద్ద లారీ అతివేగoతో వెనుక వైపు నుండి దిచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు.కాగా చిన్నారి తండ్రికి తీవ్రగాయాలు,మరో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు మదనపల్లి రూరల్ మండలం, చీకలబైల్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి కుమారుడు భువనేష్ రెడ్డి(6)సంవత్సరాలు, శివారెడ్డి కుమారుడు కిషిల్ రెడ్డి(10) సంవత్సరాలు మృతి చెందారు.ఈ ప్రమాదం లో శివారెడ్డి,త్రితేష్ రెడ్డి 4 సంవత్సరాలు ప్రమాదం నుంచి బయటపడగా, శివారెడ్డి కుమారుడు ఒక్కరు మృతి చెందగా,మరో కుమారుడు తీవ్రగాయాలు కావడం జరిగింది.సమాచారం అందుకున్న మదనపల్లి  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం  మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.చిన్నారుల మృతితో చీకలబయలు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు మృతి చెందిన చిన్నారుల కుటుంబ సభ్యులను ఆసుపత్రి వద్దకు చేరుకొని ఓదార్చి పరామర్శించారు. అలాగే ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆసుపత్రి వద్దకు చేరుకొని చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను  ఎమ్మెల్యే షాజహాన్ భాష,తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఆదేశించారు..