BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

మదనపల్లిలో జిల్లా పోలీస్ కార్యాలయం ఘనంగా ప్రారంభం.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 Mar, 2026 - 03:26 PM
83 వీక్షణలు
మదనపల్లిలో జిల్లా పోలీస్ కార్యాలయం ఘనంగా ప్రారంభం. శాంతిభద్రతల పరిరక్షణలో మరో కీలక అడుగు.

ఎమ్మెల్యే షాజహాన్ బాషా, డీఐజీ కోయ ప్రవీణ్, కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి చేతుల మీదుగా ప్రారంభమైన జిల్లా పోలీస్ కార్యాలయం.

ప్రజల ముంగిటకే పోలీస్ సేవలు.

 ఇంక 'పోలీస్ పాలన, గ్రీవెన్స్ వేదిక మదనపల్లి నుంచే.

మదనపల్లి, మార్చి 18: అన్నమయ్య జిల్లా పరిపాలనలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజలకు రక్షణను, పారదర్శక సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో మదనపల్లిలోని బెంగళూరు రోడ్డు, రేస్ కళాశాల మైదానంలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని (ఎస్పీ ఆఫీస్) బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ ఎం. షాజహాన్ బాషా, కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఐపీఎస్, జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్, ఐఏఎస్, మరియు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ లు కలిసి రిబ్బన్ కత్తిరించి కార్యాలయ ప్రవేశం చేశారు.. వేద పండితుల ఆశీర్వచనాలు మంగళ వాయిద్యాల నడుమ,  సాయుధ పోలీసు దళం (ఏఆర్) గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అధికారులు కార్యాలయంలోని వివిధ విభాగాలను, రికార్డు గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.

మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ ఎం. షాజహాన్ బాషా మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా పాలనను ప్రజల చెంతకు చేర్చడంలో భాగంగానే ఈ కార్యాలయ నిర్మాణం జరిగింది. మదనపల్లి కేంద్రంగా ఎస్పీ కార్యాలయం పని చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ప్రభుత్వ సహాయ సహకారాలతో పోలీసు శాఖకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన తెలిపారు.

కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఐపీఎస్ మాట్లాడుతూ..

 అన్నమయ్య జిల్లా పోలీసు శాఖకు ఇది ఒక మైలురాయి లాంటిదన్నారు. అత్యాధునిక సాంకేతికత  మెరుగైన వసతులతో ఈ కార్యాలయాన్ని తీర్చిదిద్దడం జరిగిందన్నారు. టెక్నాలజీని వాడుకుంటూ నేర నియంత్రణలోనూ ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో అన్నమయ్య జిల్లా పోలీస్ ముందంజలో ఉండాలని ప్రజల నమ్మకాన్ని చూరగొనేలా ప్రతి అధికారి అంకితభావంతో పని చేయాలని తెలియజేశారు

జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్, ఐఏఎస్ మాట్లాడుతూ..

పాలనా వికేంద్రీకరణ వల్ల సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టరేట్ , ఎస్పీ కార్యాలయం సమన్వయంతో పని చేస్తూ జిల్లా అభివృద్ధికి, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తాయి.  కొత్త కార్యాలయం అందుబాటులోకి రావడం పట్ల జిల్లా యంత్రాంగం తరపున హర్షం వ్యక్తం చేస్తున్నాను. మదనపల్లె కేంద్రంగా జిల్లా అన్ని ప్రాంతాల ప్రజలకు అత్యుత్తమైన పోలీస్ సేవలు అందిస్తారని తెలిపారు

జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ మాట్లాడుతూ..

నేటి నుండి ఎస్పీ కార్యాలయం పూర్తి స్థాయిలో మదనపల్లి నుండే తన కార్యకలాపాలను సాగిస్తుంది. ముఖ్యంగా ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (పి జి ఆర్ ఎస్) ఇకపై ఈ నూతన కార్యాలయంలోనే నిర్వహిస్తామని చెప్పారు ఫిర్యాదుదారులు ఈ మార్పును గమనించగలని కోరారు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో బాధితులకు తక్షణ న్యాయం అందించడమే పోలీస్ ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి పని చేయడం జరుగుతుందన్నారు

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, రాయచోటి డిఎస్పీ శ్రీ ఎం.ఆర్. కృష్ణమోహన్, ఏఆర్ డిఎస్పీ శ్రీ డి. ఏడుకొండలరెడ్డి, వివిధ విభాగాల సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా, మిగిలి ఉన్న స్వల్ప నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు.