BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 31 August 2026, 08:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో మున్నూరు కాపు మహిళా కమిటీలు ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:14 PM
68 వీక్షణలు

మధిరలో మున్నూరు కాపు మహిళా కమిటీలు ఏకగ్రీవ ఎన్నిక

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర:

మధిర పట్టణంలోని మున్నూరు కాపు కార్యాలయంలో సోమవారం మహిళా టౌన్, మండల కమిటీల ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. మున్నూరు కాపు మధిర నియోజకవర్గ అధ్యక్షుడు ఆళ్ళ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో నూతన కమిటీలను ఎన్నుకున్నారు.

మధిర టౌన్ మహిళా కమిటీ:

అధ్యక్షురాలిగా వేముల శ్రీదేవి, ఉపాధ్యక్షురాలిగా మందడపు వెంకటరావమ్మ, ప్రధాన కార్యదర్శిగా పగడాల శంకరమ్మ, కోశాధికారిగా పుప్పాల పద్మ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా హనుమంతుల పనితలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మధిర మండల మహిళా కమిటీ:

అధ్యక్షురాలిగా తోట దీపకళ, ఉపాధ్యక్షురాలిగా ఆళ్ళ సుష్మ, ప్రధాన కార్యదర్శిగా కొట్టే విజయలక్ష్మి, కోశాధికారిగా వట్టివెల్ల త్రివేణి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రామిశెట్టి రజినిలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా మున్నూరు కాపు నియోజకవర్గ అధ్యక్షుడు ఆళ్ళ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు మహిళా కమిటీలను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. మహిళల భాగస్వామ్యంతోనే సంఘం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మహిళా సంక్షేమం, సంఘం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు నాయకులు నియోజకవర్గ అధ్యక్షుడు ఆళ్ళ కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, మధిర టౌన్ అధ్యక్షుడు దేవిశెట్టి కృష్ణ, మధిర మండల అధ్యక్షుడు రంగశెట్టి చిరంజీవి, 19వ వార్డు కౌన్సిలర్ యన్నంశెట్టి అప్పారావు, పసుపులేటి సత్యనారాయణ, జున్ను సుదర్శన్, సిధా కృష్ణ, చెన్నం స్వామి, రామిశెట్టి నాగేశ్వరరావు, పాలెపు వెంకటేశ్వర్లు, లంకె మల్ల నాగేశ్వరరావు, చిన్న వెంకటేశ్వర్లు, వీరంశెట్టి సీతారామయ్య, ఎక్కటీల కృష్ణారావు, ధర్మపురి నరసింహారావు, ఎడ్ల సాంబయ్య, కోల కొండ, నీలం వెంకటేశ్వర్లు, రామిశెట్టి శ్రీనివాసరావు, నల్లగొండ నరసింహారావు, ఇల్లూరి నవీన్, పగడాల శివ తదితరులు పాల్గొన్నారు.