BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 08:02 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మహిళ ఆత్మ హత్యాయత్నం ప్రయత్నం...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Aug, 2026 - 08:02 PM
90 వీక్షణలు

పొలం వివాదంలో మహిళ ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య జిల్లా పుంగనూరు

పుంగనూరు మండలం వనమల దిన్నె పంచాయతీ మేకన జామనపల్లి గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన ఆర్. మురళి భార్య ఆర్. కవిత బుధవారం తన వ్యవసాయ పొలంలో పశువులకు ఉపయోగించే క్రిమిసంహారక ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే.. మురళికి సంబంధించిన వ్యవసాయ పొలంలో దారి విషయంలో కొన్ని సంవత్సరాలుగా సుధాకర్ నాయుడు, ఆయన కుమారుడు పవన్‌తో మురళి కుటుంబానికి వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో మురళి వ్యక్తిగత పని నిమిత్తం మదనపల్లికి వెళ్లిన విషయం తెలుసుకున్న సుధాకర్ నాయుడు, పవన్ జేసీబీతో తమ పొలాన్ని చదును చేస్తూ, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి మురళి పొలంలో దారి కోసం వేయడం ప్రారంభించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ విషయం తెలుసుకున్న మురళి భార్య కవిత అక్కడికి వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

తీవ్ర మనస్తాపానికి గురైన కవిత పశువులకు ఉపయోగించే క్రిమిసంహారక ద్రావణం తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే ఆమెను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.