BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 26 June 2026, 06:09 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మహిళా పోలీసులకు గుడ్‌న్యూస్.. మహిళా శిశు సంక్షేమ శాఖలో 710 మందికి కొత్త బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:09 AM
106 వీక్షణలు

రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 13,912 మంది మహిళా పోలీసులు త్వరలో కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. వారు ఏ శాఖలో పనిచేయాలనుకుంటున్నారనే అంశంపై వారి అభీష్టం మేరకు సచివాలయాల శాఖ ఆప్షన్లు సేకరించింది.

ఈ ప్రక్రియలో మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంపిక చేసుకున్న మహిళా పోలీసుల్లో ప్రస్తుతం ఆ శాఖ అవసరాలకు అనుగుణంగా 710 మందిని ప్రభుత్వం కేటాయించింది. అయితే ప్రస్తుతం వీరంతా సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నందున, ఆ ప్రక్రియ పూర్తైన తర్వాత కొత్త బాధ్యతల్లో చేరనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో 257 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్కో ప్రాజెక్టు పరిధిలో మూడు నుంచి నాలుగు మండలాలు ఉండగా, ప్రస్తుతం కేటాయించిన 710 మందిని మండలానికి ఒకరు చొప్పున నియమించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అలాగే, ఏ జిల్లా పరిధిలోని మహిళా పోలీసులకు అదే జిల్లాలో పోస్టింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది.

ప్రస్తుతానికి వీరిని డిప్యుటేషన్ ప్రాతిపదికన మహిళా శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం వారి పదోన్నతులు, శాశ్వత నియామకాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

ఈ నిర్ణయంతో మహిళా శిశు సంక్షేమ శాఖలో క్షేత్రస్థాయిలో సేవలు మరింత బలోపేతం కావడంతో పాటు, మహిళలు, చిన్నారుల సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత సమర్థవంతంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.