BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 22 April 2026, 05:11 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మహిళా రిజర్వేషన్ బిల్లుపై వామపక్షాల తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Apr, 2026 - 05:11 AM
187 వీక్షణలు

విజయవాడలో జరిగిన వామపక్షాల 10వ సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో 131 డీ లిమిటేషన్ బిల్లు ఓడిపోయిన తర్వాత, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి పార్టీలు, ప్రతిపక్ష వైసీపీ కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా అడ్డుకున్నారని వామపక్షాలు విమర్శించాయి. హరినాథ్ మీడియాతో మాట్లాడుతూ, "ఉత్తరాదిలో సీట్లు పెంచుకోవడం కోసం దక్షిణాదిలో అన్యాయం చేయడానికి రాజ్యాంగాన్ని సమైక్య స్పూర్తి, ప్రజాస్వామ్యం అణచివేయాలని మోడీ ప్రభుత్వము భావిస్తున్నది," అని విమర్శించారు. 2023లో ఆమోదించిన బిల్లును అమలు కాకుండా, ఎన్డీఏ పాలకులు వాయిదా వేసారని, మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనుకునే సంకల్పం వారికి లేదని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, మోడీ, అమిత్ షా దొడ్డి దారిలో డీ లిమిటేషన్ బిల్లు ఆమోదించడానికి ప్రయత్నించారని, ఇందుకు ఇండియా కూటమి అఖండంగా వ్యతిరేకించిందని చెప్పారు. మణిపూర్ లో మహిళలపై దారుణమైన హత్యలు జరుగుతున్నప్పుడు, దేశప్రధాని మోడీ బాధితులను పరామర్శించలేదని, పూల దండలతో బిల్ కిస్ బాను కేసులో దోషులను సత్కరించడం హాస్యాస్పదమని విమర్శించారు.