BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 29 May 2026, 03:25 pm
Posted by : V శ్రీనివాస్

​మహిళా సాధికారతకు పెద్దపీట.. స్వయం సహాయక సంఘాలకు రూ. 53.10 కోట్ల భారీ చెక్కు పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
29 May, 2026 - 03:25 PM
234 వీక్షణలు

మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుపుతాం: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాలు'

​తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాలు' అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు నియోజకవర్గ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 53,10,75,000 /- (యాభై మూడు కోట్ల పది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల) భారీ ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కిషన్, మంచిర్యాల నగరపాలక సంస్థ మేయర్ ధర్ని మధుకర్, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే మహిళలకు ఈ భారీ ఆర్థిక చేయూతనిచ్చామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసమే ధ్యేయంగా మహిళల ఉపాధిని, స్థానిక వసతులను పెంపొందించేలా నియోజకవర్గానికి హిందుస్థాన్ పెట్రోలియం ఇంధన కేంద్రం కూడా వచ్చిందని పేర్కొన్నారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా, ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.